: ఏపీఎన్జీవోలమందరం ఐక్యంగా ఉన్నాం: అశోక్ బాబు
ఏపీఎన్జీవోలలో విభేదాలు లేవని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో ఎన్నికల వరకే తమ మధ్య పోటీ ఉందని... మిగిలిన సమయంలో తామంతా ఒక్కటే అని చెప్పారు. అందుకే తనపై పోటీ చేసిన బషీర్ సొంత ఊరు ఒంగోలులో టీబిల్లును భోగి మంటల్లో తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇది ఏపీఎన్జీవోల ఐక్యతకు చిహ్నమని అన్నారు. ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట్రాన్ని విడదీసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్రానికి లేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చట్ట పరంగా పోరాడుతామని తెలిపారు.