: రానున్న ఎన్నికల్లో 30 సీట్లు గెలుచుకుందాం: జగన్


50 శాతం ఆదాయం ఉన్న హైదరాబాదును వదిలితే సీమాంధ్ర రెవెన్యూ పరిస్థితి ఏమిటని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. పదేళ్లలో హైదరాబాద్ వదిలి వెళ్లాలని అంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాలలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగించిన ఆయన... అందరూ కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కృషి చేద్దామని చెప్పారు. ఎవర్ని జైల్లో పెడితే, రాష్ట్రాన్ని ఎలా విడగొడితే... ఓట్లు, సీట్లు వస్తాయనే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి వచ్చేలా రానున్న ఎన్నికల్లో 30 సీట్లు గెలుచుకుందామని ప్రజలను కోరారు.

  • Loading...

More Telugu News