: ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నిలేకని


ఆధార్ కార్డు ప్రాజెక్ట్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని బెంగళూరులో ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. బెంగళూరు నుంచి లోక్ సభ బరిలోకి దిగుతున్నట్టు మూడు రోజుల క్రితమే నిలేకని ప్రకటించారు. ఈ రోజు ఆయన ఓట్ల ప్రాధాన్యతను తెలపడానికి చేపట్టిన సైకిల్ యాత్రను బెంగళూరులోని కోరమంగళలో ప్రారంభించారు. 'ప్లెడ్జ్ టు ఓట్' అనే సంస్థ చేపట్టిన ఈ ర్యాలీలో అనేకమంది యువ ఓటర్లు పాల్గొన్నారు. బెంగళూరు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిలేకని ఈ సందర్భంగా కోరారు.

  • Loading...

More Telugu News