: జైపాల్ వ్యాఖ్యలు ఆయన సంస్కారానికే వదిలేస్తున్నాం: వాసిరెడ్డి పద్మ
సీమాంధ్రులపై జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సంస్కారానికే వదిలేస్తున్నామని వైఎస్సార్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. జగన్ సమైక్యతా భావాన్ని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని... సమైక్యాంధ్ర కోసం వారి నేత చంద్రబాబుని అడగడం చేతకాక, జగన్ ను ఆడిపోసుకుంటున్నారని చెప్పారు. జగన్ ను విమర్శించే స్థాయి టీడీపీ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి మారెప్పను ఉద్దేశించి... ఆయన కొన్ని శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారినట్టు కనిపిస్తోందని, తగిన సమయంలో ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.