: కేంద్ర మంత్రి పదవి నుంచి జైపాల్ రెడ్డిని తొలగించాలి: యనమల
తెలుగు ప్రజలను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని జైపాల్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బోఫోర్స్ కేసులో ఒకప్పుడు రాజీవ్ ను విమర్శించిన జైపాల్ నేడు సోనియా భజనపరుడిగా మారారని విమర్శించారు.