: ప్రధానిగా కేజ్రీవాల్ ను చూడాలన్నదే సామాన్యుల కోరిక: ఏఏపీ
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ప్రధాని కావాలన్న కోరిక లేకపోయినప్పటికీ... సామాన్యులు మాత్రం ఆయన్ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారని ఏఏపీ నాయకుడు గోపాల్ రాయ్ తెలిపారు. కేజ్రీ ప్రధాని కావాలన్న తమ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యలను గోపాల్ రాయ్ సమర్థించారు. తామిద్దరమే కాకుండా యావత్ భారత జాతి కేజ్రీవాల్ ను ప్రధానిగా చూడాలనుకుంటోందని అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 20 రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు ఇప్పటికే ఏఏపీ ప్రకటించింది. దీనికోసం, ఇప్పటికే జాతీయ స్థాయిలో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.