: సల్మాన్ తన కోసం చేస్తున్న ఖర్చు 10 శాతమే
సల్మాన్ ఖాన్ మనసున్న నటుడని నిరూపించుకుంటున్నాడు. 48 ఏళ్ల వయసున్న ఈ నటుడు తనకొచ్చే ఆదాయంలో కేవలం 10 శాతంలోపే తన కోసం ఖర్చు పెడుతున్నాడు. తండ్రి సలీమ్ ఖాన్ చూపిన బాటలో నడుస్తున్నాడు. సలీమ్ ఖాన్ సల్మాన్ కు వచ్చే ఆదాయంలో 10 శాతం ఖర్చుకు పరిమితి విధించారు. మిగతా మొత్తం ఆర్తుల కోసం కేటాయించాలని సూచించారు. సల్మాన్ ఇప్పుడదే ఆచరిస్తున్నారు. తనకెంత డబ్బుందన్న విషయం కూడా సల్మాన్ కు తెలియదని.. దానికి దూరంగా ఉంటారని ఆయన సోదరి అల్విర చెప్పారు.