: బీజేపీలా మార్కెటింగ్ చేసుకోలేకపోయాం: రాహుల్


బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధి కోసం ఎక్కువ కష్టపడి పనిచేసిందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ తక్కువ పని చేసినప్పటికీ... చేసుకున్న దాన్ని బాగా మార్కెటింగ్ చేసుకుందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడిపోయిందని తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై నిన్న బెంగళూరులో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో యువత ప్రాధాన్యం పెరగాలని రాహుల్ అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే అభ్యర్థుల ఎంపిక జరగాలని తెలిపారు.

  • Loading...

More Telugu News