: పుట్టినవారు మరణించక తప్పదు: యూపీ మంత్రి వ్యాఖ్యలు
'పుట్టినవారు గిట్టక మానరు... గిట్టిన వారు పుట్టకా మానరు' అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చేసిన గీతోపదేశం గుర్తుండే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ క్రీడామంత్రి నారదరాయ్ కూడా ఇలానే గీత వినిపించారు. ముజఫర్ నగర్ మత ఘర్షణల బాధితులకు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో 34 మంది వరకు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విలేకరులు మంత్రిని ప్రశ్నించగా.. శిబిరాల్లో ఉన్నవారే మరణిస్తున్నారా? మా ఇళ్లలో చిన్నారులు మరణించరనే గ్యారంటీ ఉందా? మరణం సహజం అంటూ గీతాబోధన చేశారు.