: కడుపులో చికాకుకు కారణమేమంటే...


ఒక్కోసారి మనకు పేగుల్లో ఒకరకమైన అసౌకర్యం కలుగుతుంది, చికాకుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పేగులను పరీక్షించి పరిస్థితిని నిర్ధారిస్తారు. సాధారణంగా పేగులను పరీక్షించడానికి వైద్యులు ఎక్స్‌రేలపై ఆధారపడతారు. అలాకాకుండా పేగుల్లోని అసౌకర్యానికి దారితీసే ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)ని నిర్ధారించడానికి ఒక కొత్తరకం ఎమ్‌ఆర్‌ఐని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఐబీఎస్‌ నిర్ధారణకు మాగ్నెటిక్‌ రిజోనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎమ్‌ఆర్‌ఐ) ని ఉపయోగించడానికి ఒక ప్రత్యేకమైన ఎమ్‌ఆర్‌ఐ యంత్రాన్ని కూడా పరిశోధకులు రూపొందించారు.

నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు రాబిన్‌ స్పిల్లర్‌ ఈ యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని, పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేగుల లోపలి భాగాలను స్పష్టంగా దీనిద్వారా గమనించవచ్చని రాబిన్‌ చెబుతున్నారు. ఈ పరికరంతో ప్రస్తుతం ఐబీఎస్‌కు కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో బాధితులపై ప్రయోగాలు చేస్తున్నామని రాబిన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News