: డ్రీమ్ లైనర్లు మళ్ళీ వస్తున్నాయ్


ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విమాన తయారీదారు బోయింగ్ విశిష్ట ఉత్పాదన డ్రీమ్ లైనర్ విమానం మళ్ళీ గాల్లోకి లేచేందుకు రంగం సిద్ధమవుతోంది. బ్యాటరీల్లో మంటలు వస్తున్నాయని పలు విమానయాన సంస్థలు ఫిర్యాదు చేయడంతో బోయింగ్ ఆ భారీ విమానాలను నిలిపివేసింది. ఆ లిథియమ్ అయాన్ బ్యాటరీల్లో మార్పులు చేసేందుకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్.. బోయింగ్ కు అనుమతి జారీ చేసింది.

దీంతో, బ్యాటరీల్లో లోపాలను సరిదిద్దేందుకు బోయింగ్  నడుం బిగించింది. ఈ నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా ఏప్రిల్ చివరి వారం కల్లా తన ఆరు డ్రీమ్ లైనర్లను మళ్లీ ఆయా రూట్లలో నడపాలనుకుంటోంది. బోయింగ్ సంస్థ.. బ్యాటరీల్లో తలెత్తిన సమస్యలను ఈ లోపు తొలగిస్తుందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News