: కాంగ్రెస్ లో రెడ్డి వర్గానికే సీట్లు కేటాయిస్తున్నారు: మైనార్టీ నేతల ఆందోళన


కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై నల్గొండ మైనార్టీ నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను కేవలం రెడ్డి వర్గానికే కేటాయిస్తున్నారని, ఏఐసీసీ పరిశీలకుడు రఫీక్ అహ్మద్ కు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని దేవరకొండ, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల వివరాల సేకరణకు రఫీక్ వచ్చారు. ఈ నేపథ్యంలో మైనార్టీ నాయకులు తమ అభ్యంతరాలను తెలియపరచడమే కాకుండా, ఆందోళనకు కూడా దిగారు. రానున్న ఎన్నికల్లో మైనార్టీలకు 4, బీసీలకు 2, ఎస్సీలకు 2 సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News