: భవిష్యత్తులో బాలయ్య సేవా సంస్థ!
తండ్రి నందమూరి తారకరామారావుకు అభిమానుల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయన కుమారుడు బాలకృష్ణకు అంతే ఫాలోయింగ్ ఉందన్నది తెలిసిందే. అందుకే తండ్రి స్మారకార్థంగా బాలయ్య ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో బాలయ్య ఈ రోజు అభిమానుల మధ్యలో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..'భవిష్యత్తులో అభిమానుల ఆధ్వర్యంలో ఎన్ బికె సేవా సంస్థను ప్రారంభిస్తాము. ఈ సంస్థకు నేనే ఛైర్మన్ గా ఉంటాను. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను సంస్థ ద్వారా చేపడతాం' అని బాలయ్య తెలిపారు.