: రోహన్ బ్రిలియంట్.. భవిష్యత్తేంటో తెలియదు: నారాయణమూర్తి
తన సుపుత్రుడు తెలివైనవాడని ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి ప్రశంసించారు. కానీ, అతడి భవిష్యత్తు ఏంటో తనకు తెలియదన్నారు. గతేడాది జూలైలో తిరిగి ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టాక.. నారాయణమూర్తి తన కొడుకు రోహన్ మూర్తిని సహాయకుడిగా నియమించుకున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ ఫలితాల సందర్భంగా రోహన్ కంపెనీ సీఈఓ పగ్గాలు చేపడతారా? అని విలేకరులు నారాయణమూర్తిని ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. 'రోహన్ మూర్తి ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలియదు. నా కార్యాలయంలో అతడు అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాడు. అతడేం కావాలనుకుంటాడో అతడిష్టం' అని అన్నారు.