: ఆమ్ ఆద్మీ బాటలో రాజస్థాన్ ప్రభుత్వం
తాము సామాన్యులలో భాగమన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గం బాటలోనే రాజస్థాన్ సీఎం వసుంధరరాజె కూడా ఆమ్ ఆద్మీ(సామాన్యుడి) స్మరణ చేస్తున్నారు. ఇప్పటికే వ్యక్తిగత భద్రతను సగం తగ్గించుకున్న వసుంధరరాజె ఇప్పుడు తనకోసం ట్రాఫిక్ ఆపవద్దని, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు కూడా సాధారణంగానే ప్రయాణించాలని ఆదేశించారు. దీనిపై ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్రసింగ్ మాట్లాడుతూ.. ఇవి ఆమ్ ఆద్మీ రోజులని.. వారు గెలిపించబట్టే తాము అంత భారీ మెజారిటీతో గెలిచామని చెప్పారు.