: వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో మహాపచారం


అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశినాడు... తిరుమలలో మహాపచారం చోటు చేసుకుంది. వీఐపీల సేవలో తరిస్తున్న టీటీడీ అధికారులు స్వామివారిని గాలికొదిలేశారు. వేల సంఖ్యలో కొండ మీదకు చేరుకున్న వీఐపీలకు వెంకన్న దర్శన భాగ్యం కల్పించడానికి, శ్రీవారి కైంకర్యాలకు సైతం స్వస్తి పలికారు. స్వామివారికి చేయాల్సిన 1,008 నామాల అర్చనకు బదులు కేవలం 18 నామాల అర్చన మాత్రమే చేయించారు. శాస్త్రం ప్రకారం సహస్ర నామార్చన రెండు సార్లు చేయాల్సి ఉంది. ఇంకొక దారుణ విషయం ఏంటంటే, శ్రీవారికి కనీసం నైవేద్యం కూడా పెట్టలేదని సమాచారం. దీనిపై కొండపైనున్న భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వీఐపీల కోసం టీటీడీ అధికారులు సాంప్రదాయాలను సైతం పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై బీజేపీ నేత భానుప్రసాద్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News