: ఒక్కో కోడిపుంజు.. వెల రూ.లక్షపైనే


సంక్రాంతి పండగొచ్చింది.. కోడి పందేలాట కోట్ల రూపాయల్లో గ్రామాల్లో కూతలేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో సంక్రాంతి పండగకు ముందు నుంచీ పండగ మరుసటి రోజు వరకు వందల కోట్ల రూపాయల్లో పందాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. కొందరు హోదా కోసం ఆడుతుంటారు. పందాల్లో పోటీ పడే కోడి పుంజులు హైదరాబాద్ పాతబస్తీ నుంచి వెళుతుంటాయి. వీటి ధర లక్షల రూపాయల్లో పలుకుతుంది. పాతబస్తీలో ముఖ్యంగా బార్కాస్ లో పహిల్వాన్లు కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణనిచ్చి పెంచుతుంటారు. వీటికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటుండడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి కొందరు సంక్రాంతి ముందు పాతబస్తీకొచ్చి లక్షలు పెట్టి మరీ వాటిని కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు.

  • Loading...

More Telugu News