: ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయట


సంక్రాంతి నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని దక్షిణమద్య రైల్వే ప్రకటన జారీ చేసింది. వీటిని వినియోగించుకోవాలని సూచించింది. సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 02728), సికింద్రాబాద్-విజయవాడ(07208), హైదరాబాద్-కాకినాడ(07101), విజయవాడ-సికింద్రాబాద్(07207), కాకినాడ-కాచిగూడ(07338), గూడూరు-సికింద్రాబాద్(02709) రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయి. శబరిమల భక్తుల కోసం ఏర్పాటు చేసిన హైదరాబాద్-కొల్లాం(07109), హైదరాబాద్-కొల్లాం(07115), కాకినాడ-కొల్లాం(07211), మచిలీపట్నం-కొల్లాం(07221) రైళ్లలోనూ బెర్తులు అందుబాటులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News