: ఈ బ్యాటరీతో కరెంట్‌ కారుల్లో షికారుకు వెళ్లవచ్చు


కరెంటుతో నడిచే వాహనాల్లో ఎక్కువదూరం ప్రయాణం చేయడం కష్టం. అలాకాకుండా కరెంటుతో నడిచే వాహనాల బ్యాటరీల సామర్ధ్యం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వీలు కలిగేలా ఉంటే... ఇక కరెంట్‌తో నడిచే వాహనాల్లో ఎంతదూరమైనా పెట్రోలు, డీజలు అయిపోతుందేమోనన్న ఆందోళన లేకుండా చక్కగా ప్రయాణం చేయవచ్చు. ఇలా ఛార్జింగ్ ఎక్కువ కాలం వచ్చేలా కొత్తరకం బ్యాటరీని అభివృద్ధి చేయడానికి అమెరికాలోని పీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వీరు చేస్తున్న పరిశోధనలు ఫలితాలనిస్తే ప్రస్తుతం ఉన్న లిథియం సల్ఫర్‌ బ్యాటరీలను నాలుగు రెట్లు అధిక చార్జ్‌ వచ్చేలా చేయవచ్చు. అంతేకాదు, తాము చేస్తున్న పరిశోధనలు విజయవంతం అయితే అప్పుడు విద్యుత్‌ ఆధారిత వాహనాల తయారీ మరింత ఊపందుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News