: ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి కొత్త విధానం
ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి పాలక మండలి కొత్త విధానం రూపొందించింది. ఈ మేరకు బస్ భవన్ లో సమావేశమైన పాలకమండలి.. ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగాలకు ముంగింపు పలుకుతున్నట్టు తెలిపింది. ఇకపై కొత్త ఉద్యోగులను కేవలం తాత్కాలిక విధానంపైనే తీసుకుంటామని... రెండేళ్ల సర్వీసు అనంతరం వీరిని పర్మినెంట్ చేస్తామని వెల్లడించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత కొత్త పద్ధతిలో ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని, ప్రస్తుతం ఒప్పందంపై ఉన్న 9,518 మందిని ఈ నెలాఖరుకు క్రమబద్ధీకరించాలని పాలకమండలి నిర్ణయించింది.