: నటుడు ప్రేమ్ నజీర్ కు తిరువనంతపురంలో విగ్రహం


ప్రముఖ మలయాళ నటుడు ప్రేమ్ నజీర్ విగ్రహాన్ని తిరువనంతపురంలో ఏర్పాటు చేసేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సినీ, సాంస్కృతిక వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కెసి జోసెఫ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. విగ్రహ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించిందని.. ఇంకా అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. 1950 నుంచి 80 మధ్యలో దాదాపు ఆరువందలకు పైగా చిత్రాల్లో నటించి, మలయాళ చిత్ర పరిశ్రమను ఏలిన నజీర్ కు భారీ సంఖ్యలో అభిమానులున్నారు.

  • Loading...

More Telugu News