: ప్రాణత్యాగం చేసి వందలాది మందిని రక్షించిన బాలుడు


స్కూలును పేల్చేద్దామనుకున్న ఆత్మాహుతి దళ సభ్యుడిని అడ్డుకోవడానికి ఓ బాలుడు ప్రాణాలు అర్పించాడు. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తూంఖ్వా రాష్ట్రంలోని హంగు జిల్లాలో ఓ పాఠశాలను పేల్చేసేందుకు ఆత్మాహుతి దళ సభ్యుడు వెళ్లాడు. విషయం తెలిసిన ఐతెరాజ్ అనే తొమ్మిదవ తరగతి బాలుడు తన ప్రాణానికే ప్రమాదముందని తెలిసినా స్కూలు గేటు దగ్గర అడ్డుకున్నాడు. దీంతో బాంబర్ అక్కడికక్కడే బాంబు పేల్చేసుకున్నాడు.

ఐతెరాజ్ చేసిన పనివల్ల వందలాది మంది విద్యార్థులు బ్రతికి బయటపడ్డారు. బాలుడి త్యాగాన్ని పాకిస్థాన్ లోని పత్రికలు శ్లాఘించాయి. సామాన్యులు చూపించే ఇలాంటి సాహసం అందరికీ స్పూర్తినిస్తుందని, ఉగ్రవాదులపై సామాన్యులు కూడా పోరాడే ధైర్యం ఇస్తుందని కీర్తించాయి.

  • Loading...

More Telugu News