: ఆమ్ ఆద్మీలో చేరాలనుకునేవారు ఎస్ఎంఎస్ చేస్తే చాలు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యులుగా చేరాలనుకునేవారు ఎస్ఎంఎస్ చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు 077-98220033 నంబర్ కు సందేశం పంపాలని చెప్పారు. దేశ వ్యాప్తంగా జనవరి 26 నాటికి కనీసం కోటి మంది సభ్యులను చేర్చుకోవడమే తమ లక్ష్యమన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ కూడా ఏఏపీలో చేరుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు.