: రాజకీయ అవసరాల రీత్యా ప్రయత్నించండి... చరిత్రను వక్రీకరించవద్దు: శైలజానాథ్


నిజాం సంస్థానంలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారనే ఆనాడు వామపక్షాలు విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో నిజాం ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేశాయని మంత్రి శైలజానాథ్ గుర్తు చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, గుండా మల్లేష్ మాటలన్నీ చారిత్రక వక్రీకరణ అంటూ.. గౌరవ శాసనసభ్యులు కమ్యూనిస్టులుగా రాజకీయ అవసరాల రీత్యా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని.. అది వారి రాజకీయ వ్యూహమని అన్నారు. పోరాట యోధులుగా పేరొందిన వామపక్షాలు కూడా చరిత్రను వక్రీకరిస్తున్నాయని, అలా చేయవద్దని ఆయన సూచించారు. నిజాం కాలంలో మన తెలుగు వారంతా కష్టాల్లో ఉన్నారనే అప్పట్లో పోరాటాలు జరిగాయని.. ఇప్పుడు గుండా మల్లేష్ నిజాంది వేరే దేశం అనడం ఎంతవరకు సమంజసం? అని అన్నారు.

  • Loading...

More Telugu News