: మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్
భోజన విరామం ముందు వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా జట్టు అనంతరం స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు జడేజా 2, ఓజా ఒక వికెట్ తీసుకున్నారు. వార్నర్71, హగ్గీస్2 పరుగులకు అవుటవ్వగా, కార్ల్క్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. తొలి రోజు ఆటలో 61 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులతో క్రీజులో కొనసాగుతోంది.