: సభలో దాడులు జరిగాయి.. మరోసారి పునరావృతం కానీయద్దు: ధూళిపాళ్ల


గతంలో స్పీకర్ సాక్షిగా నిండు శాసనసభలో శాసనసభ్యులపై దాడులు చేసిన ఘటనలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, నిండు సభలో మరోసారి దాడులు చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని అలాంటి వాటిని స్పీకర్ ఖండించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి వారి అభిప్రాయాలను వారు వ్యక్తీకరిస్తున్నట్టే తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తాము బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News