: భద్రాచలంపై టీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మంత్రి డొక్కా


శాసనసభలో బిల్లుపై టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతుండగా మధ్యలో మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ లేచి డిప్యూటీ స్పీకర్ అనుమతితో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి 1956కు ముందు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతోందన్నారు. మరి 1956కు ముందు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలంపై టీఆర్ఎస్ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు ఈటెల సమాధానమిస్తూ.. భద్రాచలం గుడి కట్టింది గోపన్న అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. భద్రాచలం గుడికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపిన చరిత్ర నిజాం నవాబుది అని ఈటెల వివరించారు.

  • Loading...

More Telugu News