: అంచనాలను చేరుకున్న ఇన్ఫీ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు
దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకు తగినట్లుగా డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మూడు నెలల కాలంలో కంపెనీ లాభం 21.4శాతం పెరిగి రూ. 2,875కోట్లకు చేరుకుంది. 2012 డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 2,369 కోట్లుగానే ఉండడం గమనార్హం. ఇక గత డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా రూ. 10,424 కోట్ల నుంచి రూ. 13,026 కోట్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండడంతో రానున్న కాలంలో ఐటీ సేవలకు అనుకూలంగా ఉంటుందని.. మరింత పురోగతి సాధిస్తామని కంపెనీ సీఈఓ శిబూలాల్ అన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను కంపెనీ 12 శాతానికి పెంచింది.