: సమాచారాన్ని వెంటనే ఇవ్వండి: యనమల
విభజన బిల్లుపై సభలో చర్చించడానికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని మండలిలో ప్రతిపక్షనేత, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, మండలి ఛైర్మన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సమాచారముంటేనే బిల్లుపై చర్చించగలమని, సమాచారం లేకపోతే ఏమి చర్చిస్తామని అన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు చర్చలో పాల్గొనకుండా సవరణ ప్రతిపాదనలు ఎలా ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వివిధ అంశాలపై సవరణ ప్రతిపాదనలను సభ్యులు ఛైర్మన్ కు అందజేశారు.