: కేంద్ర మంత్రి కోట్లకు సమైక్య సెగ


కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలో సమైక్యసెగ తగిలింది. కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్ లో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆయనను స్థానికులు అడ్డుకుని సమైక్యాంధ్ర కోసం రాజీనామా ఎందుకు చేయలేదని నిలదీశారు. తక్షణం పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సమైక్యానికి అనుకూలంగా నినాదాలు చేస్తున్న ఉద్యమకారులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన కేంద్ర మంత్రిని... విభజన అన్నప్పుడే రాజీనామాలు చేసి ఉంటే ఇప్పడీ పరిస్థితి వచ్చేది కాదు కదా? అంటూ ప్రశ్నించారు. మంత్రి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించడంతో ఆందోళన కారులు 'కోట్ల డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

  • Loading...

More Telugu News