: అసెంబ్లీని ఎందుకు అడ్డుకుంటున్నారో జగన్ చెప్పాలి: దేవినేని
అసెంబ్లీ సమావేశాలను వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించాలని సూచించింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. సభలో చర్చ జరిగితే వాస్తవాలు బయటపడతాయని జగన్ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి క్లాజ్ పైనా సభలో గంటసేపు ఓటింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాల గడువు పెంచి పూర్తి స్థాయి చర్చ జరపాలని ఆయన సూచించారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తోంది వైఎస్సార్సీపీయేనని దేవినేని ఉమ స్పష్టం చేశారు.