: భోజన విరామానికి ఆస్ట్రేలియా స్కోరు 109/0


భారత్-ఆసీస్ క్రికెట్ జట్ల మధ్య మొహాలీ టెస్ట్  కు వరుణుడు కరుణించాడు. ఫలితంగా ఈ ఉదయం ఏ ఆటంకం లేకుండా  మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం కారణంగా తీవ్ర నిరాశకు గురైన క్రికెట్ అభిమానులు ఇవాళ స్టేడియంలో సందడి చేస్తున్నారు. నిన్న తెల్లవారుజామునుంచే కుండపోతగా వర్షం కురియడంతో మూడో టెస్టు తొలిరోజు ఆట రద్దయిన సంగతి తెలిసిందే.

దీంతో ఇవాళ నిర్ణీత సమయంకంటే అరగంట ముందుగానే మ్యాచ్ మొదలుపెట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ 54, కొవాన్ 43 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు. నాలుగు మ్యాచ్ ల ఈసీరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంతో ఉన్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News