: ఈ ‘కళ్లు’ చాలా శక్తిమంతం
కళ్లు ఒక మోస్తరు వస్తువులను చూడగలవు. కానీ, చేతి వేలిముద్రలను చూడడం అనేది అంత తేలికైన విషయం కాదు. కానీ ఈ లెన్స్‌తో చేతి వేలిముద్రలను కూడా చూడగలమని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఒక కంపెనీవారు ఒక కొత్తరకం కాంటాక్ట్ లెన్స్‌లను అభివృద్ధి చేశారు. ఈ లెన్స్ మన సాధారణ కంటిచూపుకు కూడా అందని సూక్ష్మమైన అంశాలను కూడా గమనిస్తుందని కంపెనీవారు చెబుతున్నారు. ఈ లెన్స్ సాయంతో దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడవచ్చని, ఇవి చాలా శక్తిమంతమైనవని, వీటితో వేలిముద్రలను కూడా స్పష్టంగా చూడవచ్చని దీని తయారీదారులు చెబుతున్నారు. అంతేకాదు దీన్ని సాధారణ కాంటాక్ట్ లెన్స్‌లాగా, టీవీ తెరలాగా కూడా ఉపయోగించుకోవచ్చట.