: ఆమ్ ఆద్మీ సవాల్ ను బీజేపీ సీరియస్ గా తీసుకోవాలి: ఆర్ఎస్ఎస్ అధినేత
లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సవాల్ ను భారతీయ జనతా పార్టీ సీరియస్ గా తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. హైదారాబాదులో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ పని విధానంలో మార్పులు తీసుకురావాలని, వెంటనే ఎన్నికల ప్రణాళికకు వ్యూహాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.