: తెలంగాణ విద్యుత్తును తెలంగాణకే కేటాయించాలి: హరీష్ రావు
తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తయ్యే విద్యుత్తును తెలంగాణకే కేటాయించాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని సూచించారు. అసెంబ్లీలో బిల్లును ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో జరిగేది చర్చేనని, ఓటింగ్ కాదని హరీష్ రావు తెలిపారు.