: పిల్లలు కాదు పిడుగులే!


చిన్న పిల్లలు తమకు శత్రువులెవరో, మిత్రులెవరో అనే విషయాన్ని సులభంగా పసికట్టేస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెలల పసివారు తాము ఎవరి దగ్గర భద్రంగా ఉండగలమనేదాన్ని సులువుగా గుర్తుపట్టేస్తారని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని సైకాలజీ ప్రొఫెసర్ అమందా ఎల్ వుడ్ వర్డ్ తెలిపారు. ఇందుకోసం 9 నెలల వయసున్న 64 మంది పిల్లలను బృందాలుగా చేసి, వారికి ఇద్దరు పెద్దవాళ్ల వీడియోలు చూపించారు.

అలాగే రెండు రకాల ఆహారాలు తినిపించారు. వీడియోలు చూసినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు రకరకాల భావాలు పలికించారు. దీంతో పరిశోధకులు చిన్నారులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తినేటప్పుడు వారి ఆహారపుటలవాట్లను పరిశీలిస్తారని, దానిని అనుసరించే సామాజిక సంబంధాలు నిర్వహిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News