: ఆర్ఎస్ఎస్ ను రావణాసురుడితో పోల్చిన దిగ్విజయ్
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై నిన్న (బుధవారం) సంఘ్ కార్యకర్తలు దాడి చేయటాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రెటర్ దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ ను రావణాసురుడితో పోలుస్తూ చిన్న ఉదాహరణ చెప్పారు. వారి వ్యూహంలో భాగంగానే బీజేపీ లేదా సంఘ్ కార్యకర్తలు తమ ప్రవర్తనను చూపించారన్నారు. సంఘ్ కు దాదాపు 150కి పైగా వివిధ సంస్థలు ఉన్నాయని, అన్నీ సంఘ్ మార్గంలోనే వెళుతున్నాయని దిగ్విజయ్ చురకలంటించారు. ఒక చేయి దాడులు చేస్తుంటే, మరో చేయి తైలం రాస్తుందని.. ఇలా పలు రకాల రూపాలు కలిగిన పార్టీ (బీజేపీ) అని వ్యాఖ్యానించారు. ఇలా రామాయణంలో రావణుడికి ఒక దేహం, పది తలలు ఉన్నట్లుగానే సంఘ్ వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.