: విచారణకు హాజరుకావాలని ముషారఫ్ కు ఆదేశం
రాజద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఇస్లామాబాద్ లోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుండెపోటుతో కొద్ది రోజుల కిందట రావల్పిండిలోని మిలటరీ ఆసుపత్రిలో చేరిన ముషారఫ్ కు యాంజియోప్లాస్టీ చేయాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివర్లో చికిత్స కోసం అమెరికా తీసుకువెళ్లాలని ఆయన కుటుంబం భావిస్తోంది.