: మావోయిస్టు నాయకుల మధ్య విభేదాలున్నాయి: ఉసెండి


కేవలం అనారోగ్య కారణాల వల్లే తాను లొంగిపోయానని మావోయిస్టు అగ్రనాయకుడు ఉసెండి తెలిపారు. ఈ రోజు ఉసెండిని ఆయన భార్యతో కలిపి డీజీపీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం, ఉసెండి కాసేపు మీడియా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ పరిస్థితుల్లో తాను లొంగిపోవడం సైద్ధాంతికపరంగా సరికాదని అన్నారు. ఇకపై తాను ప్రజల మధ్యే బతుకుతానని చెప్పారు. ఏదో రకంగా ప్రజలకు, సమాజానికి ఉపయోగపడాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. మావోయిస్టు అగ్రనాయకుల మధ్య విభేదాలున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News