: తన వద్ద పనిచేసే యువతి కోసం రెస్టారెంట్ అమ్మేశాడు!
మానవత్వం అంటే అమెరికా భవిష్యత్ తరాలు ఇతని దాతృత్వాన్నే ప్రస్తావిస్తాయేమో.. నిండా డబ్బు ఉండి సాయం చేయడం పెద్దవిషయం కాదని, ఉన్నంతలో కాకుండా, ఉన్నదంతా అమ్మేసి సాయపడొచ్చని మైఖేల్ డీ బియెర్ నిరూపించాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మైఖేల్ డీ బియెర్ 15 ఏళ్లుగా కైసర్ హోప్ అనే రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఇందులో తల్లి బార్బారా మాథిస్ తో పాటు పనిచేసే 19 ఏళ్ల బ్రిటానీమాథిస్ కు బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్న విషయం బయటపడింది.
పింగ్ పాంగ్ బాల్ సైజులో ఉన్న ట్యూమర్ తో బాధపడుతున్న బ్రిటానీ దగ్గర వైద్యం చేయించుకునేందుకు డబ్బు కానీ, వైద్య బీమా కానీ లేకపోవడంతో చావే శరణ్యమనుకుంది. విషయం తెలుసుకున్న మైఖేల్ తోటి వారికి సాయపడడంలోనే అసలైన ఆనందం ఉందని రెస్టారెంట్ అమ్మేసి ఆమెకు వైద్యం చేయించాడు. తన కుమార్తెకు మైఖేల్ ప్రాణదాత అని బార్బారా మాథిస్ పేర్కొంది. బార్బారా భర్త, బ్రిటానీ తండ్రి జాన్ మాథిస్ కూడా బ్రెయిన్ ట్యూమర్ తోనే మృత్యువాత పడ్డాడు.