: నార్వేలో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే


నార్వేలో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులైపోయారు. బుధవారంతో ఆ దేశానికి చెందిన విదేశీ వెల్త్ ఫండ్ విలువ 5.11లక్షల కోట్ల క్రౌన్లకు చేరుకుంది. ఈ ఫండ్ ను 1990లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని స్టాక్స్ (కంపెనీల్లో వాటాలు)లో 1 శాతం వాటాలు ఈ ఫండ్ దగ్గరే ఉన్నాయి. అలాగే బాండ్లు, రియల్ ఎస్టేట్ లోనూ అంతే శాతం వాటాలున్నాయి. ఇదే ఆ దేశ సంపద పండడానికి కారణమైంది. కొన్ని దేశాలు ద్రవ్యలోటుతో, మరికొన్ని దేశాలు అప్పుల్లో కూరుకుపోయి సతమతమవుతుంటే.. ఈ దేశం మాత్రం సంపదతో వెలిగిపోతోంది. ఈ దేశ జనాభా 50,96,000 మంది. ఫండ్ విలువను పంచితే ఒక్కొక్కరికి 10 లక్షల క్రౌన్లు వస్తాయి. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక్కొక్కరికి కోటి రూపాయలకుపైనే వస్తాయి.

  • Loading...

More Telugu News