: రామచంద్రయ్య వ్యాఖ్యలపై శాసనమండలిలో గందరగోళం.. వాయిదా
రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారని మంత్రి సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. శాసనమండలిలో తెలంగాణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, వెనుకబాటు కారణంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నామని చెబుతున్నా అందులో వాస్తవమెంత? అని ఆయన ప్రశ్నించారు. వెనుకబాటు కారణంగా రాష్ట్రాల విభజన జరగాలంటే దేశంలో రెండు వందల రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీంతో తెలంగాణ నేతలు మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం చెబుతూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో, శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మండలి ఛైర్మన్ చక్రపాణి శాసనమండలిని వాయిదా వేశారు.