: కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతోనే హరీష్ కి మంత్రి పదవి: సీఎం
శాసనసభలో టీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రసంగంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతోనే ఆనాడు హరీష్ రావు మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ దేనని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీవల్లే తానూ ముఖ్యమంత్రి అయ్యానన్నారు. అయితే సభలో వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని సూచించారు.
అంతకుముందు హరీష్ రావు ప్రసంగానికి అడ్డుతగిలిన చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి.. కాంగ్రెస్ పై ఆరోపణలను ఖండించారు. 2009 నుంచి చోటు చేసుకున్న వాటిపైనే సభలో మాట్లాడాలనన్నారు.
అంతకుముందు హరీష్ రావు ప్రసంగానికి అడ్డుతగిలిన చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి.. కాంగ్రెస్ పై ఆరోపణలను ఖండించారు. 2009 నుంచి చోటు చేసుకున్న వాటిపైనే సభలో మాట్లాడాలనన్నారు.