: ఏకమవుదాం, కుట్రను అడ్డుకుందాం: ఎర్రబెల్లి
తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా ఏకమై... తీర్మానం పెట్టాలన్న సీమాంధ్ర నేతల కుట్రను అడ్డుకుందామని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు చర్చ పేరిట మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత నేతలంతా ఆ కుట్రను అడ్డుకునేందుకు ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం వేలాది మంది ఇప్పటికే బలయ్యారని, రాష్ట్ర సాధన కోసం ఇంతటి మహత్తర అవకాశం మరోసారి రాదని ఆయన స్పష్టం చేశారు.