: మౌలానా ఆజాద్ పై చిత్రాన్ని తెరకెక్కించడం నా కల: అమీర్ ఖాన్


ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పై ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని తనకో కల ఉందని నటుడు అమీర్ ఖాన్ వెల్లడించాడు. ఆజాద్ తనకు సమీప బంధువని, ఆయన జీవిత చరిత్రను చిత్రంగా మలచి తన స్వప్నాన్ని త్వరలో నెరవేర్చుకుంటానన్నాడు. నిన్న (బుధవారం)కోల్ కతాలో 'అపీజే కోల్ కతా లిటరరీ ఫెస్టివల్-2014'ను అమీర్ ప్రారంభించాడు. అనంతరం మాట్లాడుతూ.. ఆజాద్ రచనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించే కొద్దికాలం ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలన్నింటినీ తాను చదివానని అమీర్ గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News