: రౌడీని కాపాడేందుకు పోలీసులపై రాళ్ల దాడి


రౌడీషీటర్ ను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా సిక్రీ గ్రామస్థులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ రాళ్ల దాడిలో 10 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దోపిడీ కేసులో రౌడీషీటర్ పున్నాను అరెస్టు చేసేందుకు ఇద్దరు ఎస్సైలతో కూడిన పదిమంది పోలీసుల బృందం సిక్రీకి వెళ్లింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలతో పోలీసులపై మూకుమ్మడి దాడికి దిగారు.

ఈ దాడిలో పోలీసుల జీపు పూర్తిగా ధ్వంసం కాగా, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులపై దాడి కేసులో 13 మందిపై కేసులు నమోదు చేశామని, నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించినట్టు జిల్లా ఏఎస్పీ హెచ్ఎన్ సింగ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News