: విజయమ్మ వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి ఆనం
టీబిల్లుపై చర్చకంటే ముందు ఓటింగ్ నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వ్యాఖ్యలను మంత్రి ఆనం తప్పుబట్టారు. టీబిల్లుపై చర్చ జరగకుండా ఓటింగ్ చేపడితే... సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పడానికి కూడా వీలుండదని అభిప్రాయపడ్డారు. చర్చ సుదీర్ఘంగా సాగాలని, చర్చలో అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలపాలని అన్నారు. రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా సభ్యులు వ్యవహరించాల్సి ఉందని సూచించారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభ జరుగుతోందని, సభను సజావుగా కొనసాగించాలని సభ్యులకు మంత్రి ఆనం విజ్ఞప్తి చేశారు. శాసనసభలో ఆనం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.