: శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి మూసివేత


జమ్ముకాశ్మీర్ లో తీవ్రంగా పడుతున్న మంచు రహదారి మార్గాలను కప్పేసింది. బన్నిహాల్, పట్నితోప్ సెక్టార్ లలో మూడు వందల కిలోమీటర్ల మేర రహదారిపై మంచు కప్పేసింది. ఈ కారణంగా శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని ట్రాఫిక్ అధికారులు మూసి వేశారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల భద్రత కోసం ఈ రోజు రహదారిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. రోడ్డుపై ఒకటిన్నర అడుగు మేర మంచు పేరుకుపోయిందని, దాన్ని తొలగించాకే మార్గాన్ని పునరుద్ధరిస్తామన్నారు.

  • Loading...

More Telugu News