: గూగుల్ పై 1.25కోట్ల జరిమానా
గూగుల్ ప్రైవసీ పాలసీ (యూజర్ల సమాచార గోప్యత విధానం) తాము విధించిన నిబంధనలకు అనుగుణంగా లేనందుకు ఆ సంస్థపై ఫ్రాన్స్ నిఘా ఏజెన్సీ సీఎన్ఐఎల్ 1.5లక్షల యూరోలు (రూ. 1.25కోట్లు) జరిమానా విధించింది. ఈ మెయిల్స్ ఇతర సేవల విషయంలో యూజర్ల నుంచి ఎందుకు సమాచారం సేకరిస్తోంది? ఎంతకాలం దీన్ని భద్రపరుస్తుంది? తదితర వివరాలను గూగుల్ స్పష్టం చేయలేదని సీఎన్ఐఎల్ పేర్కొంది. అయితే, తమ ప్రైవసీ పాలసీ స్పష్టంగానే ఉందని గూగుల్ స్పష్టం చేసింది.