: సంజయ్ దత్ భార్యకు సర్జరీ?
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భార్య మాన్యత వైద్య పరీక్షల నిమిత్తం నిన్న (బుధవారం) ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. ఆమె కాలేయంలో కణితి ఉన్నట్లు తేలడంతో.. గుండె సంబంధమైన సమస్యలు కూడా ఉండవచ్చనే అనుమానంతో మరిన్ని ముఖ్యమైన పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. పరీక్షల తర్వాత వచ్చే రిపోర్టుల ఆధారంగా మాన్యతకు శస్త్ర చికిత్స అవసరమా? లేదా? అనే విషయాన్ని నిర్ధారిస్తామని వైద్యులు పేర్కొన్నారు. కాగా, భార్య కోసం సంజయ్ నెల రోజుల పెరోల్ పై గతేడాది డిసెంబర్ లో జైలు నుంచి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే.